Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు..!!

గతకొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
rains

rains

గతకొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లో వర్షం బీభత్సం స్రుష్టిస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అంచనా వేసింది. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది.

తెలంగాణలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనునన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత 24గంటల్లో ఆదిలాబాద్, మంచిర్యాల, నారాయణపేట్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురువగా…రానున్న 24గంటల్లో జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లిలో తేలికపాట వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నల్లగొండ , సూర్యపేట, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరకోస్తా ఆంధ్ర, యానంలో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రాయలసీమలోనూ పలుచోట్లు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

  Last Updated: 11 Oct 2022, 05:33 AM IST