Site icon HashtagU Telugu

Bengaluru : బెంగళూరులో బేకరీ సిబ్బందిపై దాడి.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Crime

Crime

బెంగళూరులో బేకరీ కార్మికులపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు.ఈ కేసులో ముగ్గురు వ్య‌క్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తున్న కార్తీక్ (20), హోటల్ మేనేజర్ కార్తీక్ (23), అల్యూమినియం వర్కర్ సల్మాన్ (20)గా పోలీసులు గుర్తించారు. శ్రీ బ్రహ్మలింగేశ్వర బేకరీలో శుక్రవారం అర్ధరాత్రి 12:10 గంటల ప్రాంతంలో నిందితులు సిగరెట్లు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అరెస్టయిన ముగ్గురిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.