ఏపీలోని కడప జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. చాపాడులో ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. తిరుపతికి వెళ్లి ప్రొద్దుటూరు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను అనూష, ఓబులమ్మ, రామలక్ష్మిగా గుర్తించారు.
Also Read: New Delhi: ట్రాఫిక్‌లో హారన్ కొట్టిన మహిళ.. చితకబాదిన ప్రయాణికుడు!
పూర్తి వివరాలలోకి వెళ్తే.. కడప జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైఎమ్మార్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను అనూష, ఓబులమ్మ, రామలక్షుమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.