Site icon HashtagU Telugu

E-Cigarettes : హైద‌రాబాద్‌లో రూ. 15 ల‌క్ష‌ల విలువైన ఈ-సిగిరేట్లు ప‌ట్టుకున్న పోలీసులు

E Cigarates Imresizer

E Cigarates Imresizer

హైదరాబాద్‌లో రూ.15 లక్ష‌ల విలువైన ఈ-సిగిరేట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్టకు చెందిన ముగ్గురు వ్యక్తులను కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సౌత్) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌ధాన నిందితుడు జీడిమెట్ల వాసిగా పోలీసులు గుర్తించారు. అత‌ని తన ఖాతాదారులకు సిగరెట్లను పంపిణీ చేయడానికి పంజాగుట్టను ఎంచుకున్నాడు. ప్రాథమిక విచారణ ఆధారంగా, నిందితుడు తన నివాసంలో ఈ-సిగరెట్ల స్టాక్‌ను కలిగి ఉన్నాడని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో మార్కెటింగ్ ద్వారా కస్టమర్‌లకు చేరువయ్యేవారు.దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.