Site icon HashtagU Telugu

Owaisi: AIMIM చీఫ్ కాన్వాయ్ పై కాల్పులు.. ఓవైసీ సేఫ్!

Owaisi Attack Imresizer

Owaisi Attack Imresizer

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. యూపీ ఎన్నికల ప్రచారంలో అసద్‌పై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. అయితే ఈ ఫైరింగ్‌లో ఆయనకెలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్టు భావిస్తున్నారు. మీరట్‌(Meerut) నుంచి తిరిగి వస్తుండగా.. ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల విషయాన్ని అసరుద్దీన్ ధ్రువీకరించారు. యూపీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. ఎస్పీ(SP), బీజేపీ(Bjp)లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒవైసీ కాన్వాయ్‌పై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిజారసీ(Chhajarsi) టోల్‌ ప్లాజా వద్ద ఒవైసీ కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది. ఫైరింగ్‌ చేసినవాళ్లు ఆయుధాలు అక్కడే విడిచివెళ్లినట్టు చెప్పారు ఒవైసీ. తాను అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.

“యూపీ మీరట్‌లోని కిథౌర్​లో ఎన్నికల సంబంధిత కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ బయలుదేరాను. చిజారసీ టోల్​గేట్​ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగురు ఉన్నారు.” అని తెలిపారు అసదుద్దీన్. స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది.

Exit mobile version