వరంగల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వర్ధన్నపేట శివారు డీసీ తండా వద్ద ప్రమాదం జరిగింది. మృతులు కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకటసాయిరెడ్డిగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుంచి వరంగల్‌కు వస్తుండగా డీసీ తండా వద్ద ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Accident: వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు

Road accident