Site icon HashtagU Telugu

Hyderabad : విహార‌యాత్ర‌లో విషాదం..సెల్ఫీ దిగుతూ నీటిలో ప‌డి ముగ్గురు మృతి

Death Representative Pti

Death Representative Pti

హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురాలో విషాదం నెల‌కొంది. విహార‌యాత్ర‌కు వెళ్లిన ముగ్గురు నీటిలో ప‌డి మృతి చెందారు.సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నెంటూరు ట్యాంక్‌ వద్దకు విహారయాత్రకు వెళ్లిన ఓ చిన్నారి స‌హా మ‌రో ఇద్ద‌రు సెల్ఫీ దిగుతూ నీటిలో మునిగి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని యాకుత్‌పురాకు చెందిన షేక్‌ ఖైసర్‌(26), మేనల్లుడు షేక్‌ ముస్తఫా(03), బంధువు మహ్మద్‌ సోహైల్‌(17)లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాసాన్‌పల్లి మక్తాకు వచ్చారు. వారు నెంటూరు సమీపంలోని ట్యాంక్ వద్దకు వెళ్లారు, అక్కడ ఖైసర్ తన మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి సెల్ఫీ తీసుకోవడానికి ముస్తఫాను తీసుకుని ముందుకు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో ఇద్దరూ నీటిలోకి జారిపోవడంతో, సోహైల్ వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. దీంతో ముగ్గురు నీటిలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు.