Site icon HashtagU Telugu

KCR: ప్రజలతో కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం

KCR Comments

KCR Comments

KCR: గత పదిహేనురోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ప్రజల ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమౌతున్న అధినేత కేసీఆర్, గత రెండువారాల నుండి ముందస్తు సమాచారంతో నియోజక వర్గాల వారీగా కలుస్తున్న సంగతి తెలిసిందే. తనను చూసేందుకు ఎర్రవెల్లి నివాసానికివస్తున్న ప్రజలతో ఓపికతో గంటల పాటు నిలబడి కేసీఆర్ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగుతూ ప్రజలతో ఆత్మీయ సమావేశాలు కొనసాగిస్తున్నారు.

గత పదిహేను రోజుల నుంచి దాదాపు యాభై వేలకు పైగా ప్రజలు తమ అభిమాన నేతను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ని కలిసి తమ ఆనందాన్ని కష్టసుఖాలను ఆత్మీయతనుపంచుకున్నారు. తమ అభిమానం తో అధినేతను ఫోటోలు సెల్ఫీల్లో బంధించారు. యే యే నియోజకవర్గాల వారు ఎప్పడు రావాలి అనే విషయాలను, తర్వాతి ఆత్మీయ సమావేశాల వివరాలను ప్రకటించడం జరుగుతుంది.