Site icon HashtagU Telugu

Hyderabad : హైదరాబాద్‌లో ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్

Crime

Crime

హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట పోలీసులు శనివారం ముగ్గురు బైక్ దొంగ‌ల‌ను అరెస్ట్ చేశారు. అజంపురాకు చెందిన మహ్మద్ హైదర్ అలియాస్ సోను (24), యాకుత్‌పురాకు చెందిన ఫుడ్ డెలివరీ ఏజెంట్ సయ్యద్ అర్బాజ్ మెహదీ బాకూరీ (23), కంచన్‌బాగ్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్ (36)ల‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3.5 లక్షల విలువైన ఆరు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదర్‌, అర్బాజ్ యాకుత్‌పురాలోని మాతా కి ఖిడ్కి వద్ద నీటి సరఫరా యూనిట్‌లో కలిసి పనిచేశారని.. వీరు ఇళ్ల వెలుపల పార్క్ చేసిన బైక్‌లను దొంగిలించేవారని పోలీసులు తెలిపారు. వారు వాహనాలను సమద్‌కు విక్రయించినట్లు టాస్క్‌ఫోర్స్ అదనపు కమిషనర్ ఎ.వి.ఆర్. నరసింహారావు తెలిపారు.