Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బెదిరింపు కాల్స్!

తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, కొంతమంది దుండగులు చంపేస్తామని కాల్స్ చేస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

Published By: HashtagU Telugu Desk
Komatireddy Venkatreddy, nalgonda

Komatireddy Venkatreddy

కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  (Komatireddy Venkat Reddy) నిత్యం వార్తల్లోనే నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మునుగోడు ఉప ఎన్నికలో తన సోదరుడు  రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన చెరుకు సుధాకర్ పై బెదిరింపు ఆడియో లీక్ వ్యవహారం కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చెరుకు సుధాకర్ కోమటిరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. అయితే తాజాగా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, కొంతమంది దుండగులు చంపేస్తామని కాల్స్ చేస్తున్నారని కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) ఆరోపించారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పీఎస్ లో పిర్యాదు చేశారు. 504,506 ఐటి ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

  Last Updated: 11 Mar 2023, 11:36 AM IST