Site icon HashtagU Telugu

Delhi: పెళ్లాంతో గొడవ ఢిల్లీ సీఎంను చంపేస్తానని ఫోన్

Rekha Gupta

Rekha Gupta

Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఘజియాబాద్‌లోని కొత్వాలి ప్రాంతంలో శ్లోక్ త్రిపాఠి అనే వ్యక్తిని ఢిల్లీ–ఘజియాబాద్ పోలీసుల సంయుక్త బృందం అరెస్టు చేసింది. అనంతరం అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆయనను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, నిందితుడు తన భార్యతో గొడవ పడి మద్యం మత్తులో ఉన్న సమయంలో, ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి “ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తా” అంటూ బెదిరించినట్లు తెలిసింది. ఈ హెచ్చరికను పలికిన తర్వాత అతను తక్షణమే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

Zainab Ravdje : అఖిల్ అక్కినేని భార్య జైనబ్ రవ్జీ ఎవరు?.. వ్యాపార కుటుంబానికి చెందిన ప్రఖ్యాత కళాకారిణి గురించి తెలుసుకోండి

బెదిరింపులకు ఉపయోగించిన సిమ్‌కార్డు గోరఖ్‌పూర్ చిరునామాతో నమోదు కాగా, అది నిందితుడి బంధువు పేరుతో రిజిస్టర్ అయిందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులన్నీ అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులు వెంటనే సీఎం రేఖా గుప్తా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు ఘజియాబాద్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

Sugavasi Balasubramanyam : టీడీపీకి గుడ్ బై చెప్పిన సుగవాసి బాలసుబ్రమణ్యం