Site icon HashtagU Telugu

Cyclone: ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఈ నెలలోనే.. పేరేంటో తెలుసా..?

Cyclone Reuters1683096603837

Cyclone Reuters1683096603837

Cyclone: తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. రోజూ వర్షాలు పడుతుండటంతో.. ఎండాకాలం కాస్త వర్షాకాలంగా మారిపోయింది. అకాల వర్షాలతో రైతుల పంట నేలపాలవ్వడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి తరుణంలో భారత వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. తుపాన్ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం వచ్చే వారం బలపడి తుఫాన్ గా మారే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించదింది. ఈా సైక్లోన్ ప్రభావంతో భారీగా వర్షాలు పడతాయని తెలిపింది.

ఈ సైక్లోన్‌కు మోచా అనే పేరు పెట్టారు. తూర్పు తీర రాష్ట్రాలకు ఈ తుఫాన్ ముప్పు పొంచి ఉంటుందని స్పష్టం చేసింది. అగ్నేయ బంగాళాఖాతంలో ఈ తుఫాన్ బలపడే అవకాశముందని, దీని వల్ల మత్స్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ తుఫాన్ గురించి భారత వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వివరలను వెల్డించారు.

మే 6నాటికి బంగాళాఖాతంలో వాయుగుడం ఏర్పడే అవకాశముందనుందని, మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. ఇది తీవ్ర అల్పపీనడంగా మారి మే 9వ తేదీ నాటికి తుఫాన్ గా బలపడే అవకాశముందని ఆయన తెలిపారు. ఈ సైక్లోన్ ఉత్తర దిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశముందని స్పష్టం చేసింది. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుఫాన్ గురించి కచ్చితమైన సమాచారం తెలుస్తుందని భారత వాతావరణశాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో వచ్చేవారంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే విదర్భ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న రోజుల్లో తుఫాన్ హెచ్చరికలతో రైతన్నల్లో కలవరం మొదలైంది.