Nitin Gadkari: నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు.

Nitin Gadkari: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు. అయితే దీనికి సంబందించి ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ కింద నమోదైన కేసులో నాగ్‌పూర్‌ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు సీనియర్‌ పోలీసు అధికారి బుధవారం తెలిపారు. ఇదిలా ఉండగా ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ (ఎన్‌ఐఏ)కి బదిలీ చేయాలనీ ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ అలా చేయలేని నేపథ్యంలో చార్జిషీట్ దాఖలు చేసేందుకు మరో 50 రోజుల గడువు కావాలని నగర పోలీసుల అభ్యర్థనను నాగ్‌పూర్‌లోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు సోమవారం అంగీకరించింది.

ఈ కేసులో ప్రధాన నిందితులు జయేష్ పూజారి, అలియాస్ కాంత ఇప్పటికే కస్టడీలో ఉన్నారు. కర్ణాటకలోని ఓ జైలు నుంచి అతడిని నాగ్‌పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన పూజారి రూ. 100 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపు కాల్ చేశాడు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నాడు.

Read More: Cremation Rules: అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదా?