Site icon HashtagU Telugu

Visakhapatnam: విశాఖ‌లో బీచ్ క్లీన్ డ్రైవ్ కు మంత్రులు

Vizag Beach Clean

Vizag Beach Clean

విశాఖపట్నంలోని కోస్టల్ బ్యాటరీ వద్ద శుక్ర‌వారం ప్రారంభమైన భారీ బీచ్ క్లీన్ అప్ డ్రైవ్‌లో వేలాది మంది పాల్గొన్నారు. ప్రజలు చేతి తొడుగులు ధరించి, బస్తాలు పట్టుకుని పాల్గొన్నారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావడానికి, బాధ్యత వహించడానికి, నగరాన్ని పరిశుభ్రంగా, ప్లాస్టిక్ రహితంగా ఉంచే లక్ష్యంతో GVMC న్యూయార్క్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా బీచ్ క్లీన్ అప్ డ్రైవ్‌ను ప్రారంభించింది. తీరం వెంబడి 28-కిమీల వరకు విస్తరించి ఉన్న 40 వేర్వేరు పాయింట్ల వద్ద, పరిశ్రమలు, కార్పొరేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల నుండి 22,000 మంది అధికారులు, స్వచ్ఛంద సేవకులు 22,000 మంది పాల్గొన్నారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, ఆదిమూలపు సురేష్‌, మేయర్‌ జి హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్‌ ఎ మల్లికార్జున, మున్సిపల్‌ కమిషనర్‌ జి లక్ష్మీశ, ఎమ్మెల్సీ వరుదు కలయాణి, ఎమ్మెల్యే ఎం శ్రీనివాసరావు, ఎన్‌ఆర్‌ఇసిఎప్‌ చైర్మన్‌ కెకె రాజు తదితరులు తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు.