Sudha Murthy: నా భర్తను మొదటిసారి చూసి ఎవరి చిన్నపిల్లవాడు అనుకున్నాను.. సుధామూర్తి కామెంట్స్ వైరల్?

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నారాయణమూర్తి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన సతీమణి రచయిత్రి సుధామూర్తి కూడా మనందరికీ సుపరిచితమే. తాజాగా సు

Published By: HashtagU Telugu Desk
Sudha Murthy

Sudha Murthy

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నారాయణమూర్తి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన సతీమణి రచయిత్రి సుధామూర్తి కూడా మనందరికీ సుపరిచితమే. తాజాగా సుధామూర్తి బాలీవుడ్ ప్రముఖ టాక్ షో అయిన ది కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్.నారాయణమూర్తి తో తనకు తొలి పరిచయం ఎలా జరిగింది అన్న విషయాన్ని తెలిపారు. అంతేకాకుండా తన వైవాహిక జీవితం గురించి వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సుధామూర్తి. ప్రముఖ బాలీవుడ్ నటి రవినా టాండన్, నిర్మాత గునీత్ మోంగాతో కలిసి సుధా మూర్తి ఈ షోలో పాల్గొన్నారు.

అందుకు సంబంధించిన వీడియోను కూడా తాజాగా విడుదల చేశారు షో నిర్వాహకులు. ఇక ఆ వీడియోలో ఇన్ఫోసిస్ సహవ్యస్థాపకుడుని తొలిసారి ఎప్పుడు కలిశారు అని కపిల్ శర్మ సుధామూర్తిని ప్రశ్నించగా.. సుధామూర్తి స్పందిస్తూ.. ఒక స్నేహితురాలి ద్వారా నారాయణమూర్తి పరిచయమైనట్లు ఆమె తెలిపింది. నాకు ప్రసన్న అనే ఒక స్నేహితురాలు ఉండేది. ఆమె ప్రతి రోజు ఒక పుస్తకం తీసుకొని వచ్చేది. అందులో మొదటి పేజీపై నారాయణమూర్తి పేరుతో పాటు ప్రదేశాల పేర్లు కూడా ఉండేవి. నారాయణమూర్తి పేరు పక్కన ఇస్తాంబుల్,షెశావర్ ఇలాంటి పేర్లు కనిపించేవి. దాన్ని చూసి నేను నారాయణమూర్తి అంతర్జాతీయ బస్ కండెక్టరా అని అనుకునేదాన్ని.

ఒకరోజు ఆయనను కలిసేందుకు వెళ్లాను మూర్తిని చూడక ముందు ఆయన ఒక సినిమా హీరోల అందంగా ఉంటారని అనుకున్నాను. కానీ డోర్ తెరవగానే ఆయన్ని చూసి ఎవరి చిన్న పిల్లాడు అని అనిపించింది అంటూ నవ్వుతూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంది సుధామూర్తి. సుధా మూర్తి మాటలకు అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. కాగా సుధామూర్తి నారాయణ మూర్తి పెళ్లి జరిగే దాదాపుగా 44 ఏళ్ళు అవుతుంది. ఈ దంపతులకు కూతురు అక్షత కుమారుడు రోహన్ కూడా ఉన్నారు. కూతురు అక్షతా యూకే ప్రధాని రిషి సునాక్ సతీమణి.

  Last Updated: 10 May 2023, 04:38 PM IST