AP BRS: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలి

AP BRS: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన దురదృష్ట కరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ విచారం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో దాదాపు 40కి పైగా బొట్లు దగ్ధ మవ్వడం బాధాకరమన్నారు. ప్రమాదంలో దగ్ధగమైన బోట్ల పై ఆధారపడి రెండు వేల కుటుంబాలు జీవిస్తున్నాయాన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బాదిత […]

Published By: HashtagU Telugu Desk
Thota

Thota

AP BRS: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన దురదృష్ట కరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ విచారం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో దాదాపు 40కి పైగా బొట్లు దగ్ధ మవ్వడం బాధాకరమన్నారు. ప్రమాదంలో దగ్ధగమైన బోట్ల పై ఆధారపడి రెండు వేల కుటుంబాలు జీవిస్తున్నాయాన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బాదిత కుటుంబాల వారు జీవనాధారం కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో బాదిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారం చెల్లించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనపై దర్యాప్తు సంస్థ తో సమగ్ర విచారణ చేయించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోర్టు యాజమాన్యం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు

  Last Updated: 20 Nov 2023, 06:00 PM IST