Site icon HashtagU Telugu

Social Media: ఉద్యోగాలు చేయకుండా భారీగా సంపాదిస్తున్న ఆ గ్రామస్థులు.. అసలేం చేస్తున్నారంటే?

Whatsapp Image 2023 03 19 At 22.16.35

Whatsapp Image 2023 03 19 At 22.16.35

Social Media: ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా అంతా ఆన్ లైన్ బాట పట్టారు. ఈ వేదకగా బాగా సంపాదిస్తున్నారు. ఎంత అంటే సాప్ట్ వేర్ ఉద్యోగాల స్థాయిలోనే డబ్బును సంపాదిస్తున్నారు. అయితే చాలా వరకు ఊరికి, పట్టణానికో ఒకరు ఇలా ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే గ్రామంలో మాత్రం ఆ ఊరంతా సోషల్ మీడియానే వేదికగా చేసుకొని లక్షల్లో అర్జిస్తోంది.

లాక్‌డౌన్‌ కారణంగా సోషల్‌మీడియా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.ఈ క్రమంలో యూట్యూబ్‌ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతోంది ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని తులసి గ్రామ యువత.గ్రామంలో నివసిస్తున్నప్పటికీ తమకున్న వనరులతో మంచి కంటెంట్‌ని రూపొందించి యూట్యూబ్‌
ద్వారా ఆదాయాన్ని అర్జిస్తున్నారు.