Site icon HashtagU Telugu

Viral Jawan Dance:ఏం చేసినవ్ కాకా…బారాత్ లో దుమ్ములేపిన జవాన్.!

Picc

Picc

డ్యాన్స్ చేశామంటే గత్తరలేపేలా ఉండాలి. తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టాలి. ఈలలు వేయాలి. రెచ్చిపోయి ఆడాలి. మైమరిచిపోయి చేస్తేనే మాజా వస్తుంది. డ్యాన్స్ చేయడంలో ఒక్కోక్కరిది ఒక్కో స్టయిల్. ఇక పెళ్లి బారాత్ లో డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మైమరచిపోయి చిందులేయడం మనకే సొంతం. తాజాగా ఓ వ్యక్తి చేసిన డ్యాన్సులు ఇంటర్నెట్ లో విపరీతంగా సర్య్కూలేట్ అయ్యింది. నెటిజన్లతో ఈలలు వేయిస్తోంది. అతని నేపథ్యం ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో అది ఇంకా వైరల్ అయ్యింది.

ఐపీఎస్ ఆఫీసర్ దిపాన్షు కుబ్రా గురువారం ఉదయం ట్విటర్ లో ఓ వీడియోను షేర్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. అందుకు కారణం ఆ వీడియోలో డ్యాన్సు చేసింది ఓ ఆర్మీ జవాన్. ఆ వ్యక్తి పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా డ్యాన్స్ చేశాడు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆ జవాన్…స్నేహితుడు పెళ్లి బారాత్ లో అలా మైమరిచిపోయి చిందులేశాడు. జవాన్ డ్యాన్సుకు లైకులు, షేర్లతో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అయితే ఇది ఎక్కడ జరిగిందన్న వివరాలను దీపాన్షు చెప్పలేదు.