Site icon HashtagU Telugu

Watch Video: మ్యాంగో మ్యాగీ .. సరికొత్త స్ట్రీట్ ఫుడ్

Mango

Mango

మ్యాగీ మిల్క్ షేక్, మ్యాంగో డాలీ ఐస్ క్రీమ్ చాట్ అనే వెరైటీ స్ట్రీట్ ఫుడ్ లు ఇటీవల సోషల్ మీడియా లో వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో కొత్త ఫుడ్ వచ్చి చేరింది. అదే.. మ్యాంగో మ్యాగీ!! మాజా, మామిడి పండు ముక్కలు, మ్యాగీ కలగలిపిన రుచికర వంటకం ఇది. చూస్తే నోరు ఊరక మానదు. దీన్ని ఓ మహిళ చక్కగా తయారు చేస్తున్న ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లోని ‘ ది గ్రేట్ ఇండియన్ ఫుడీ’ (THE GREAT INDIAN FOODIE) అనే ఫుడ్ బ్లాగింగ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ మ్యాగీ తయారీ క్రమంలో చాలా మాజాను వాడారు. వండటం పూర్తయిన తర్వాత మ్యాంగో ముక్కలు, మాజా జ్యూస్ ను కూడా అందించారు.

ఈ వీడియో కు 115K కుపైగా వ్యూస్ వచ్చాయి. మ్యాంగో మ్యాగీ ఆలోచన క్రియేటివ్, సీజనల్ అని కొందరు నెటిజన్లు పేర్కొనగా, తమ ఫెవరేట్ మ్యాంగో ను మ్యాగీ తో ఎందుకు కలిపారంటూ ఇంకొందరు ప్రశ్నించారు. కొత్త వంటకాలతో ప్రయోగాలు చేయడం స్ట్రీట్ ఫుడ్స్ అమ్మే వారు హాబీ గా మార్చుకోవడం ఇప్పుడు కొత్త ట్రెండ్. దీనివల్ల వారి గిరాకీ కూడా చాలా మేరకు పెరుగుతోంది. ఇటువంటి కొత్త వంటకాల రుచి చూసేందుకు ప్రధానంగా యువత, పిల్లలు ఎగబడుతున్నారు.

Exit mobile version