Island@BHK price: అతి తక్కువ ధరకే అందాల దీవి.. కొనేద్దాం!!

"నాకొక దీవి కావలెనోయ్.." అని తపించే వారు కూడా ఎందరో ఉంటారు. అలాంటి వారికి ఒక బంపర్ ఆఫర్. వాళ్ళ కోసం స్కాట్లాండ్ లో ఒక దీవి ఎదురు చూస్తోంది.

  • Written By:
  • Updated On - August 9, 2022 / 03:28 PM IST

“నాకొక దీవి కావలెనోయ్..” అని తపించే వారు కూడా ఎందరో ఉంటారు. అలాంటి వారికి ఒక బంపర్ ఆఫర్. వాళ్ళ కోసం స్కాట్లాండ్ లో ఒక దీవి ఎదురు చూస్తోంది. దాని ధర కూడా చాలా చాలా తక్కువ. మన ముంబైలోని అత్యంత విలాసవంతమైన ఏరియాలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కొనేందుకు అవసరమైన బడ్జెట్ ను ఖర్చు చేస్తే.. ఆ దీవి సొంతమైపోతుంది. ఈ లెక్క స్కాట్లాండ్ లోని ప్లాడ్డ (Pladda) దీవికి సంబంధించినది. దాదాపు 28 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దీవి కొనుగోలు కాస్ట్ కేవలం రూ.3.35 కోట్లు మాత్రమే. ఇంత చీప్ గా అమ్మకానికి సిద్ధమైన ప్లాడ్డ దీవికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇవి..

ప్లాడ్డ దీవి విశేషాలు…

* స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గో కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ప్లాడ్డ దీవి ఉంది.
* 1790వ దశకంలోనే
ఈ దీవిలో హెలి ప్యాడ్, లైట్ హౌస్ నిర్మించారు. ఇప్పటికీ ఇవి ఉన్నాయి.
* ఈ దీవిలో 5 బెడ్ రూమ్ లతో ఒక పెద్ద ఇల్లు ఉంది.రెండు రిసెప్షన్ రూమ్స్ ఉన్నాయి. షవర్ రూమ్, కిచెన్ రూమ్, సిట్టింగ్ రూమ్ కూడా ఉన్నాయి.
* 30 ఏళ్ల క్రితం ఈ దీవిని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ డెరెక్, స్యాలి మార్టన్ కొనుగోలు చేశారు.
* ప్రస్తుతం స్కాట్లాండ్ కు చెందిన ఒక “నైట్ ఫ్రాంక్” అనే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ద్వారా ఈ దీవిని అమ్మకానికి పెట్టారు.
* వందలాది వలస పక్షులకు ఈ దీవి నిలయం.
* ఇక లైట్‌ హౌస్‌లో లైట్‌కి ప్రత్యేకంగా కరెంట్‌ అవసరం లేదు. ఇది సౌరశక్తిని వినియోగించు కుంటుంది.

ఇక్కడ జనం ఎందుకు ఉండటం లేదు?

ఇలా ఆ చుట్టుపక్కల చిన్న చిన్న ద్వీపాల్లో నిర్మించిన ఇల్లలో ఎవరూ ఉండడం లేదు. దీంతో అవి పాడైపోతున్నాయి. అందుకే ఎంత తక్కువకు వీలైతే.. అంత తక్కువకు వాటిని అమ్మేస్తున్నారు. ఎంత తక్కువ ధర పెట్టినా కొన్నేవాళ్లే కరువయ్యారు. ఎందుకంటే మనిషి జాడే కనిపించిన ఐలాండ్లో పర్మినెంట్‌గా ఉండేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.