Site icon HashtagU Telugu

Gutha Sukender Reddy: ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదు : గుత్తా వ్యాఖ్యలు

Gutta Sukender Reddy Imresizer

Gutta Sukender Reddy Imresizer

Gutha Sukender Reddy: వచ్చే వేసవిలో మంచినీటి సమస్య వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయం కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. మిషన్ భగీరథ కు సంబంధించిన విషయంలో ప్రభుత్వం చొర తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. మిషన్ భగీరథ లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు పేమెంట్లు కూడా త్వరగా చెల్లించాలన్నారు. ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు లేదని ఏఎంఆర్పి కి నీరు రావడంలేదని అన్నారు . ఈ సంవత్సరం ప్రతి పంట కూడా బాగా దెబ్బతిన్నదని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేక భువనగిరి ఏదో ఒక నియోజకవర్గ నుండి ఎంపీగా పోటీ చేస్తారని అన్నారు. తాను ఎంపీగా పనిచేసినప్పుడు ఉమ్మడి జిల్లాలోని దాదాపుగా అన్ని అసెంబ్లీ తమ పరిధిలోకి వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని అనడం సహజము అని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థను అయినా చులకనగా చూడరాదని, సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి పై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లాంటి రాజకీయాలు తెలంగాణలోకి రావద్దని తాను కోరుకుంటున్నాను అని అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు సరికావున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నెల పరిపాలనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని అన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే స్వాగతిస్తామని ఆయన అన్నారు.