First Flying Car : ట్రాఫిక్ జామ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అయినా తరచుగా ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు..
దీనివల్ల వారి విలువైన సమయం వృథా అవుతుంది.
అయితే మార్కెట్లోకి ఎగిరే కార్లు రాబోతున్నందున త్వరలోనే ఆ సమస్య తొలగిపోతుంది.
ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయిందో అక్కడ కారులోని ఫ్లయింగ్ మోడ్ బటన్ ను నొక్కగానే.. అది గాల్లోకి విమానంలా దూసుకుపోతుంది!!
ఔను.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే కారు “అలెఫ్ మోడల్ A”కు(Alef Model A) అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమాన అనుమతి ఇచ్చింది. ప్రపంచంలో ఈ అనుమతి పొందిన తొలి కారు ఇదే. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన “అలెఫ్ ఏరోనాటిక్స్” కంపెనీ ఈ ఫ్లైయింగ్ కారును(First Flying Car) తయారు చేసింది. అలెఫ్ ఫ్లయింగ్ కారు బుకింగ్‌లు గత ఏడాది (2022) అక్టోబర్ నుంచే ప్రారంభమయ్యాయి. ఇది ఎలక్ట్రిక్ ఎగిరే కారు. దీనికి US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) నుంచి ప్రత్యేక ఎయిర్ వర్థినెస్ సర్టిఫికేషన్‌ను పొందినట్లు అలెఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ ప్రకటించింది. రోడ్డుపై నడవడంతో పాటు ఆకాశంలో ఎగరడం అలెఫ్ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత. ఈ ఫోర్-వీలర్ కారు బాడీని కార్బన్ ఫైబర్ మెటీరియల్ తో తయారు చేశారు. దీనికి రెక్కలు కూడా జోడించబడ్డాయి. గల్-వింగ్ డోర్లు, కవర్ వీల్ వెల్స్, స్టైలిష్ రిమ్స్ వంటి ఫీచర్స్ సైతం ఉన్నాయి.
Also read : Bill Gates Office : పోర్న్ చూస్తావా.. వివాహేతర సంబంధం ఉందా.. ఆ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలట : వాల్ స్ట్రీట్ జర్నల్
ఫ్లయింగ్ మోడ్ బటన్ ను నొక్కగానే..
అలెఫ్ మోడల్ A కారులోని ఫ్లయింగ్ మోడ్ బటన్ ను నొక్కగానే కాక్‌పిట్‌లో ఒకటి లేదా రెండు సీట్లు 90 డిగ్రీల కోణంలో ముందుకు జరుగుతాయి. రెండు రెక్కలున్న బైప్లేన్ లాగా కారు మారిపోతుంది. ఈ ఎగిరే కారు ముందుకు, వెనుకకు, పైకి, క్రిందికి, కుడివైపు, ఎడమవైపు, ఎక్కడికైనా డ్రైవర్ సూచనల ప్రకారం ఈజీగా దిశను మార్చుకుంటుంది. అలెఫ్ ఫ్లయింగ్ కారు నడిచేందుకు ఎనిమిది మోటర్ల ద్వారా శక్తి లభిస్తుంది. ఇందులో డిటెక్షన్ సిస్టమ్, పారాచూట్ ఉంటాయి. ఈ ఎగిరే కారును ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 321.8 కి.మీ దూరం జర్నీ చేస్తుంది. ఈ కారును హైడ్రోజన్ ఇంజన్ వర్షన్ లోనూ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది . ఈ కారు ధర సుమారు రూ.2.46 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలెఫ్ ఫ్లయింగ్ కార్ల ఉత్పత్తి 2025 చివరి నాటికి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కార్ల డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఎగిరే కారును సెలబ్రిటీ డిజైనర్ హిరాష్ రాజాగీ డిజైన్ చేశారు. గతంలో ఆయన బుగాటీ, జాగ్వార్ కార్ల మోడల్‌లను కూడా రూపొందించాడు.