AP New Districts: కొత్త జిల్లాల రూపం ఇదీ..!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతోన్న కసరత్తు వేగవంతం అయింది. జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను చీఫ్ సెక్రటరీ కోరాడు. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

  • Written By:
  • Publish Date - January 25, 2022 / 11:47 PM IST

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై జరుగుతోన్న కసరత్తు వేగవంతం అయింది. జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను చీఫ్ సెక్రటరీ కోరాడు. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీర్ శర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు, అభ్యంతరం గురించి అడిగి తెలుసుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది అభిప్రాయాలు తెలియజేయాలని కోరాడు. 1974 ఏపీ జిల్లాల (ఏర్పాటు) చట్టంలోని సెక్షన్-3(5) ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్ సభ నియోజకవర్గం జిల్లా కానుంది. అయితే అరకు ను రెండు గా చేస్తే 26 జిల్లాలు అవుతాయి.
చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించిన సీసీఎల్ఏ రేపోమాపో అధికారికంగా వెల్లడించి నుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆన్ లైన్లో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్నారు.ఆన్ లైన్లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు సర్కులేట్ చేసింది. దాని ప్రకారం…
శ్రీకాకుళం…(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం+ఎచ్చెర్ల,
విజయనగరం… 7నియోజకవర్గాలు (విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రాజాం,+ఎస్‌కోట)
వైజాగ్ జిల్లా… భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్, సౌత్‌
అనకాపల్లి… 7నియోజకవర్గాలు… ( అనకాపల్లి,చోడవరం, పాయకరావుపేట,పెందుర్తి, యలమంచిలి,మాడ్గుల, నర్సీపట్నం.
అరకు…. 3 నియోజకవర్గాలు (అరకు,పాడేరు,రంపచోడవరం)
పార్వతీపురం… నాలుగు నియోజకవర్గాలు(పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ)
రాజమండ్రి… కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం,రాజమండ్రిసిటి, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి
కాకినాడ… కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం
అమలాపురం… అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం
ఏలూరు…. ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం,ఉంగుటూరు, నూజివీడు,కైకలూరు
నరసాపురం… నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు,తాడేపల్లిగూడెం.
విజయవాడ… విజయవాడ ఈస్ట్‌, వెస్ట్, సెంట్రల్‌, నందిగామ,జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు
మఛిలీపట్నం,… మఛిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం…
బాపట్ల… బాపట్ల, రేపల్లే,వేమూరు,చీరాల,పరచూరు,అద్దంకి
గుంటూరు… గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, ప్రత్తిపాడు,పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి
నరసరావుపేట… నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు
ఒంగోలు… ఒంగోలు, కొండపి,దర్శి, కనిగిరి, గిద్దలూరు,మార్కాపురం,ఎర్రగొండపాలెం+ సంతనూతలపాడు
నెల్లూరు… నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు,కావలి,ఆత్మకూరు, ఉదయగిరి,కందుకూరు+సర్వేపల్లి
తిరుపతి… తిరుపతి,శ్రీకాళహస్తి,సత్యవేడు, వెంకటగిరి, గూడురు, సూళ్లూరుపేట+చంద్రగిరి
చిత్తూరు… చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు,పూతలపట్టు, పలమనేరు, కుప్పం+పుంగనూరు
రాజంపేట… రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి
కడప… కడప, పులివెందుల, జమ్మలమడుగు,పొద్దుటూరు, కమలాపురం,మైదుకూరు, బద్వేలు
నంద్యాల… నందికట్కుకూరు,శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి, నంద్యాల
కర్నూలు… కర్నూలు,కొడుమూరు, ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ+పాణ్యం….
అనంతపురం… అనంతపురం, సింగనమళ,తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం,రాయదుర్గం +రాప్తాడు
హిందూపురం… హిందూపురం,పెనుకొండ, మడకశిర,పుట్టపర్తి,ధర్మవరం,కదిరి

అమలాపురం… కోనసీమ జిల్లా..
అరకు.. అల్లూరి సీతారామారాజు జిల్లా
హిందూపురం… పుట్టపుర్తి హెడ్‌క్వార్టర్‌గా.. సత్యసాయి జిల్లా
తిరుపతి… బాలాజీ జిల్లా…
కృష్ణాజిల్లా… ఎన్టీఆర్ జిల్లా….
రాజమండ్రి … గోదావరి జిల్లా…
రాజంపేట… రాయచోటి హెడ్‌క్వార్టర్‌గా… అన్నమయ్య జిల్లా
బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా .. భవపురి జిల్లా….
అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా….
ప్రస్తుతానికి ఈ వివరాలను మంత్రులకు అందించారని తెలుస్తుంది. చివరి నిమిషంలో కొన్ని మండలాలకు చెందిన మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.