Site icon HashtagU Telugu

Owaisi Update: వామ్మో ఒవైసీపై కాల్పులు.. అందుకే జ‌రిపారట‌..!

Asaduddin Owaisi

Asaduddin Owaisi

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై దుండగులు కాల్పులు జరిపిన సంగ‌తి తెలిసిందే. యూపీలో ఎన్నికల ప్రచారం చేసి మీర‌ట్ నుండి తిరిగి వ‌స్తుండ‌గా, ఛ‌జ‌ర్సీ టోల్‌ప్లాజా వ‌ద్ద‌ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరగ్గా, ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఫైరింగ్‌లో అస‌దుద్దీన్ ఒవైసీకి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు కానీ, ఒవైసీ ప్ర‌యాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారుకు మాత్రం పంక్చ‌ర్ అయ్యింది.

ఇక ఇప్ప‌టికే అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపిన దుండగులు ఇద్దరినీ యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు వారిని విచారించగా, ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఒవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలు చేశార‌ని, దీంతో త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని, అందుకే ఒవైసీ కాన్వాయ్ పై కాల్పులు జరిపామని దుండుగులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో దుండుగులు మొత్తం నాలుగు రౌండ్లు కాల్పులు జ‌ర‌ప‌గా, ఒవైసీ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో పోలీసులు మ‌రింత విచార‌ణ‌లో భాగంగా సీసీ టీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

Exit mobile version