Site icon HashtagU Telugu

KTR: బీజేపీ నిజరూపం ఇదే: మంత్రి కేటీఆర్..!!

Ktr Imresizer (1)

Ktr Imresizer (1)

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం…ఇస్తూ వారితో ఇంటరాక్టివ్ అవుతుంటారు. అయితే ట్విట్టర్ లో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో వంట గ్యాస్ ధర రూ. 50 పెరిగింది. ఈ నేపథ్యంలో అప్పట్లో స్మృతి ఇరానీ బీజేపీ నేతలతో కలిసి ధర్నాకు దిగిన ఫొటోను ఓ నెటిజన్ పోస్టు చేశాడు. దీనిపై మంత్రిని స్పందించాలని కోరాడు. కేటీఆర్ స్పందిస్తూ…వంచన అనే సమాధానం ఇచ్చారు.

ఇక కర్నాటకలో ముఖ్యమంత్రి కావాలంటే రూ. 2,500కోట్లు అడుగుతున్నారంటూ…ఓ నెటిజన్ పోస్టు చేస్తూ…దానిపై కేటీఆర్ ను స్పందించాలని కోరాడు. బీజేపీ నిజరూపం ఇదే అంటూ సమాధానం ఇచ్చారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ కోసం 2017లో తాము డబ్బులు చెల్లించామని..ఇప్పటివరకు ఆమోదం లభించలేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. దానిపై స్పందిస్తూ…బీఆర్ఎస్ అంశం హైకోర్టు పరిధిలో ఉందని తెలిపారు.

Exit mobile version