Site icon HashtagU Telugu

Bengaluru: బెంగళూరుకు ‘బాంబు’ బెదిరింపులు!

Bengaluru

Bengaluru

బెంగళూరు సిటీ మరోసారి వార్తలోకెక్కింది. కర్ణాటకలోని బెంగళూరులోని ఏడు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు మొత్తం ఏడు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ బెదిరింపులు బూటకమని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ, పరీక్షలు జరుగుతున్న క్యాంపస్‌లలో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించారు. కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా అన్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. “మీ పాఠశాలలో చాలా శక్తివంతమైన బాంబులు ఉన్నాయి. ఇది జోక్ కాదు‘‘ అని మెయిల్ లో రావడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు.

పాఠశాలలు ఇవే..

ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వర్తుర్

గోపాలన్ ఇంటర్నేషనల్ స్కూల్

కొత్త అకాడమీ స్కూల్

సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్

ఇండియన్ పబ్లిక్ స్కూల్, గోవింద్‌పురా

ఎబెనెజర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎలక్ట్రానిక్ సిటీ

 

Exit mobile version