Tech Companies: ఇది ప్రమాదం.. వర్క్ ఫ్రమ్ చేసేవారికి టెక్ కంపెనీల వార్నింగ్

ఆర్ధిక మాంద్యం భయం టెక్ కంపెనీలను భయపెడుతోంది. దీంతో ముందు జాగ్రత్తల చర్యలు చేపడుతున్నాయి. వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకునే పనులు చేస్తోన్నాయి.

  • Written By:
  • Publish Date - May 5, 2023 / 09:59 PM IST

Tech Companies: ఆర్ధిక మాంద్యం భయం టెక్ కంపెనీలను భయపెడుతోంది. దీంతో ముందు జాగ్రత్తల చర్యలు చేపడుతున్నాయి. వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోన్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తగ్గించుకునే పనులు చేస్తోన్నాయి. దీంతో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నాయి. మాస్ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టాయి. ప్రధానంగా టెక్ కంపెనీల్లో లేఆఫ్ ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

కొన్ని కంపెనీలు వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులకు వర్క ఫ్రమ్ ఆప్షన్ ఇచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారికి షాక్ ఇచ్చింది. కంపెనీ సీఈవో అరవింద్ కృష్ణ రిమోట్ ఉద్యోగుల భవిష్యత్ కు వర్క్ ఫ్రమ్ హోం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఆఫీసుకు రావాలని సీఈవో అరవింద్ కృష్ణ కోరలేదని, కేవలం రిమోట్ వర్క్ ఉద్యోగుల కెరీర్ ను కఠినతనం చేస్తుందని చెప్పినట్లు తెలిపారు.

మేనేజర్ స్థాయి ఉద్యోగులపై వర్క్ ఫ్రం హోం ప్రతికూల ప్రభావం చూపుతుందని ఐబీఎం ప్రతినిధులు చెబుతున్నారు. మేనేజర్లు ఉద్యోగులను పర్యవేక్షించాలని, తమ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులు ఏం చేస్తున్నారో చూడాల్సి ఉంటుందని అంటున్నారు. వర్క ఫ్రమ్ హోం చేయడం వల్ల అది సాధ్యం కాదని, దీని వల్ల ఆ పాత్రకు న్యాయం చేయలేరని అంటున్నారు.

అయితే ఉద్యోగులు ఆఫీస్ కు రావాలని ఇప్పటికే అన్నీ టెక్ కంపెనీలు సూచిస్తున్నాయి. వర్క ఫ్రమ్ హోం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుందని, అందుకే ఆఫీస్ కు వచ్చేయాలని సూచిస్తున్నారు. ఐబీఎం ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోంకి స్వస్తి చెప్పింది. ఇక ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్త్ కూడా వర్క్ ఫ్రమ్ హోం వల్ల ప్రతికూల ఫలితలు వస్తున్నాయని గతంలో వ్యాఖ్యానించారు.