Rahul Gandhi : ఇది అంబానీ, అదానీ ప్రభుత్వం: రాహుల్ గాంధీ

ఎర్రకోట వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ, కేంద్ర ప్రభుత్వం (Central Government) పై నిప్పులు చెరిగారు.

Published By: HashtagU Telugu Desk
Rahul Gandhi Speech At Red Fort

Rahul Gandhi Speech At Red Fort

కేంద్రంలో ఉన్నది నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం కాదని, అంబానీ (Ambani), అదానీ (Adani) ప్రభుత్వమని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) శనివారం (డిసెంబర్ 24న) హర్యానాలోని బదార్‌ పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలో (Delhi) ప్రవేశించింది. ఎర్రకోట వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), కేంద్ర ప్రభుత్వం (Central Government) పై నిప్పులు చెరిగారు. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు నింపేసి దేశం ఎదుర్కొంటున్న నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

భారత్ జోడో యాత్ర లక్ష్యం గురించి మాట్లాడుతూ, దేశాన్ని ఏకం చేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. కన్యాకుమారిలో యాత్ర ప్రారంభించినప్పుడు ద్వేషాన్ని తుడిచిపెట్టేయవలసిన అవసరం వుందని అనుకున్నానని రాహుల్ పేర్కొన్నారు. దేశంలో ప్రతి చోట విద్వేషం నిండిపోయిందన్నారు. అయితే, తాను యాత్ర ప్రారంభించి నడక మొదలుపెట్టిన తర్వాత నిజం వేరేలా ఉందన్నారు. దేశంలో ప్రతి క్షణం హిందూ, ముస్లింల మధ్య విద్వేషం వ్యాప్తి చెందుతోందన్నారు. కానీ, ఇది నిజం కాదని, ఈ దేశం ఒక్కటేనని, తాను తన యాత్రలో లక్షలాదిమందిని కలిశానని, వారందరూ ఒకరినొకరు ప్రేమిస్తారని అన్నారు. మరి అలాంటప్పుడు ద్వేషం ఎలా వ్యాప్తి చెందుతోందన్నదే అసలైన ప్రశ్న అని రాహుల్ పేర్కొన్నారు.

చుట్టూ ఒకసారి చూడాలని, ఓవైపు జైన్ మందిర్, మరోవైపు గురుద్వారా, ఇంకోవైపు ఆలయం, మరోవైపు మసీదు ఉన్నాయని, ఇండియా అంటే ఇదేనని అన్నారు. మన దృష్టిని మరల్చేందుకే హిందూ, ముస్లిం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఎవరైనా మన జేబు కొట్టేయాలంటే తొలుత వారు చేసేది మన దృష్టిని మరల్చడమేనని పేర్కొన్నారు. అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే హిందూ, ముస్లిం రాజకీయాలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

Also Read:  Best Fruits For Weight Loss: చలికాలంలో ఈజీగా బరువు తగ్గించే పండ్లు.. అవేంటంటే?

  Last Updated: 25 Dec 2022, 02:36 AM IST