Site icon HashtagU Telugu

Rahul Gandhi : ఇదో కొత్త ఎత్తుగడ..ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు : రాహుల్‌ గాంధీ

This is a new tactic.. There is no place for the opposition here: Rahul Gandhi

This is a new tactic.. There is no place for the opposition here: Rahul Gandhi

Rahul Gandhi : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు లోక్‌సభ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వడం సంప్రదాయమని గుర్తు చేశారు. లోక్‌సభలో తనను మాట్లాడేందుకు అనుమతించడంలేదని అన్నారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మాత్రం ఇది సరైన మార్గం కాదన్నారు. ఏం జరుగుతోందో తనకు తెలియడంలేదని.. మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడెనిమిది రోజుల నుంచి నన్ను మాట్లాడేందుకు అనుమతించట్లేదు. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు అన్నారు.

Read Also: SLBC : పూర్తి చేసి తీరుతాం – మంత్రి ఉత్తమ్ క్లారిటీ

ఇటీవల ప్రధాని కుంభమేళా గురించి మాట్లాడినప్పుడు నేను నిరుద్యోగం గురించి మాట్లాడాలనుకున్నా.. కానీ మాట్లాడేందుకు అనుమతించలేదు.మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతించకపోవడం అప్రజాస్వామికం అని రాహుల్‌ అన్నారు. నేను ఎప్పుడు లేచి నిలబడినా మాట్లాడేందుకు అనుమతించడం లేదు. మేం చెప్పాలనుకొనే అంశాలను లేవనెత్తేందుకు మాకు అనుమతి ఇవ్వడంలేదు. నేనేమీ చేయలేదు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా కూర్చున్నా అన్నారు.

ఈ సభలో తండ్రీ కూతురు, తల్లీ కుమార్తె, భార్యా భర్తలను సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష నేత 349 రూల్‌ (సభలో సభ్యులు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిని సూచించే నిబంధన) ప్రకారం నడుచుకుంటారని తాను ఆశించినట్లు రాహుల్‌ గాంధీ తెలిపారు. ఇక, బుధవారం సభా కార్యకలాపాల సమయంలో స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ.. సభా గౌరవాన్ని కాపాడేందుకు నిబంధనలు పాటించాలని సూచించారు. సభలోని సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. సభ్యుల ప్రవర్తన ఈ సభ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేదని అనేక సందర్భాల్లో తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

Read Also: Online Betting : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిషేధించేందుకు సిట్‌ ఏర్పాటు: సీఎం రేవంత్‌ రెడ్డి