Future Cricketer: ఈ బాలిక కాబోయే క్రికెటర్..! వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!

క్రికెట్ కు ఉన్నంత ఆదరణ, ప్రాచుర్యం మరే క్రీడకూ లేదనడం నిజమే. ఏటా రెండు నెలల పాటు ఐపీఎల్ సమరం, అంతర్జాతీయ మ్యాచ్ లు ఎన్నో జరుగుతుంటాయి.

Future Cricketer: క్రికెట్ కు ఉన్నంత ఆదరణ, ప్రాచుర్యం మరే క్రీడకూ లేదనడం నిజమే. ఏటా రెండు నెలల పాటు ఐపీఎల్ సమరం, అంతర్జాతీయ మ్యాచ్ లు ఎన్నో జరుగుతుంటాయి. వీటిని ఎక్కువ మంది చూస్తుంటారు. క్రికెట్ కు ఉన్న ఈ స్థాయి ఆదరణ.. ఎంతో మందిలో భవిష్యత్తు క్రికెటర్లు (Cricketer) కావాలన్న ఆకాంక్షకు బీజం అవుతోంది. ఇక ఈ ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ కూడా మొదలైంది. ఇవన్నీ కలసి ఎక్కువ మంది ఆటగాళ్లకు అవకాశాలు రానున్నాయి. మహిళా క్రికెటర్లకు కూడా ఐపీఎల్ పుణ్యమాని భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని, మరింత మంది ఈ ఆట వైపు అడుగులు వేస్తారని భావిస్తున్నారు.

ఇక విషయానికొస్తే, ఓ బాలిక బ్యాట్ తీసుకుని ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ (Cricketer) మాదిరిగా వచ్చిన ప్రతి బంతినీ చక్కని షాట్ గా మలుస్తుండడం చూస్తే.. ఈ చిన్నారి భవిష్యత్తులో తప్పకుండా మంచి క్రికెటర్ అవుతుందని అనుకుంటారు. అలాంటి ఓ బాలిక క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. క్లిష్టమైన డెలివరీలను సునాయాసంగా, కసితో షాట్స్ గా మలచడాన్ని గమనించొచ్చు. స్వ్కేర్ కట్స్, కవర్ డ్రైవ్స్, అలా అన్ని రకాల షాట్స్ బాదేస్తోంది.

అంతటి ప్రతిభను చూసి రైల్వే మంత్రి ముగ్ధులయ్యారు. ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ‘‘హెలికాప్టర్ షాట్ నాకు బాగా నచ్చుతుంది. మరి మీకు..?’’ అంటూ ఆయన ప్రశ్న సంధించారు. ఈ చిన్నారికి భవిష్యత్తులో మహిళల ఐపీఎల్ లో మంచి అవకాశాలు ఖాయమే అనిపిస్తోంది. ఈ వీడియోని 3 లక్షల మంది చూశారు. అయితే యూజర్ల నుంచి ఊహించని రిప్లయ్ లు కూడా వస్తున్నాయి. సకాలంలో రైలు రావడమే తమ ఎంపిక అంటూ.. కొందరు రైలు సర్వీసుల్లో గంటల తరబడి ఆలస్యాన్ని ప్రస్తావించారు.

Also Read:  Rahul Gandhi Disqualified: రాహుల్ పై అన‌ర్హ‌త వేటు