Site icon HashtagU Telugu

Bride On Tractor: పెళ్లి మండపానికి ఈ వ‌ధువు ఎలా వెళ్లిందో చూడండి..!

Tractor Wedding

Tractor Wedding

ఓ వ‌ధువు త‌న పెళ్లిని వినూత్న రీతిలో చేసుకుంది. అంద‌రూ గుర్ర‌పు బండి, ప‌ల్ల‌కిల‌తో వివాహ వేదిక‌పైకి వ‌స్తుంటారు. కానీ ఓ పెళ్లి కూతురు ట్రాక్ట‌ర్ న‌డుపుకుంటూ వేదిక‌పైకి వ‌చ్చిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన భారతి తార్గే ట్రాక్టర్‌పై పెళ్లి వేదికలోకి ప్రవేశించింది. టార్గే ఎంట్రీకి సంబంధించిన వీడియో గత వారంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియోలో అలంకరించబడిన ట్రాక్టర్‌ను మండపం వైపు నడుపుతున్నప్పుడు భారతి తార్గే బ్లాక్‌ సన్ గ్లాసెస్ ధరించడం చూడవచ్చు. ట్రాక్టర్ నడుపుతుండగా ఆమెతో పాటు ప‌క్క‌న ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఉన్న జావ్రా గ్రామంలో మే 26న తార్గే వివాహం చేసుకున్నారు. తార్గే తండ్రి కైలాస్ తార్గే వ్య‌వ‌సాయం చేస్తుంటారు.