Site icon HashtagU Telugu

Thiruvananthapuram Rains: మంచాన పడిన మహిళను రక్షించిన పోలీసులు

Thiruvananthapuram Rains

Thiruvananthapuram Rains

Thiruvananthapuram Rains:  విశ్రాంతి లేకుండా సేవలు అందిస్తున్న పోలీసులు తమ మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఔదార్యాన్ని చాటుకున్నారు. తిరువనంతపురంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో కొన్ని పురాతన ఇళ్ళు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈ క్రమంలో కొందరు తమ ఇళ్లను కోల్పోయారు. మరికొందరు ఇళ్లలో చిక్కుకుని సహాయం కోసం వేచి చూశారు. అయితే ఓ ఇంట్లో మహిళ పేషేంట్ ఆపదలో ఉన్నదని గమనించి పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు.

భారీ వర్షం కారణంగా ఇళ్లు నీటమునిగడంతో తిరువనంతపురం పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.మంచాన పడిన రోగిని తన చేతుల్లోకి తీసుకుని సురక్షితంగా తరలించిన తీరు ప్రతిఒక్కరి హృదయాన్ని కదిలించింది. తిరువనంతపురంలోని వలియతుర టైటానియం మరియు బాలానగర్ ప్రాంతంలో అనేక ఇళ్లు వరదలు ముంచెత్తడంతో వలియతుర ఎస్‌హెచ్‌ఓజిఎస్ రతీష్ నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఓ ఇంట్లో భారీగా నీరు చేరడంతో ఓ పోలీస్ అధికార తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంచాన పడిన మహిళ ఇంట్లో చిక్కుకుపోవడం గమనించి వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఎస్‌ఐఎస్‌వో అజేష్‌ కుమార్‌ ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తిరువనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వివిధ శాఖల మంత్రులు వర్ష నష్టం కారణంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షం కారణంగా పరిస్థితిని మంత్రులు జిఆర్ అనిల్, వి శివన్‌కుట్టి, కె రాజన్, ఆంటోని రాజు అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 17 సహాయ శిబిరాలను ప్రారంభించినట్లు మంత్రులు తెలిపారు. నగరంలో 15 క్యాంపులు ప్రారంభించినట్లు తెలిపారు. తిరువనంతపురంలో పరిస్థితి అదుపులో ఉందని కూడా సమాచారం.

Also Read: Group 2 Student Pravallika Incident : ఆ యువతి మరణం అందరికీ ఒక గుణపాఠం కావాలి