Site icon HashtagU Telugu

Thief Arrested : 17 ఏళ్ల‌లో ఏడుసార్లు అరెస్టైన దొంగ‌

Thief Escaping

Thief Escaping

ఓ దొంగ 17 ఏళ్ల నుంచి ఏడు సార్లు అరెస్ట‌వుతూ వ‌స్తున్నాడు. 17 ఏళ్ల వ్యవధిలో మొత్తం 43 ఇళ్లలో చోరీకి పాల్పడిన 30 ఏళ్ల వ్యక్తిని సీసీఎస్ మాదాపూర్ బృందం గురువారం అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తిని కూకట్‌పల్లి నిజాంపేట్‌కు చెందిన కోటిపల్లి చంద్రశేఖర్‌గా గుర్తించారు. నిందితుడిని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో 2005 నుంచి 2022 వరకు ఏడుసార్లు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 57 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.70 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాష్ట్రంలోని మేడిపల్లి-14, జవహర్ నగర్-7, మియాపూర్-04, మార్కెట్-3, ఘట్‌కేసర్-3, మెదక్ టౌన్-03, చిలకలగూడ-02 బోవిన్‌పల్లి-02, మహంకాళి-01, కుషాయిగూడలో పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు.