Site icon HashtagU Telugu

Relationship : ఈ రాశులవారు తమ పార్ట్నర్ ను ఎప్పటికీ వదిలిపెట్టరట..

relationship zodiac signs

relationship zodiac signs

Relationship : ప్రేమైనా, పెళ్లైనా మూన్నాళ్ల ముచ్చటగా ఉంటోంది. అందరూ అలానే ఉండరు. కొందరు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని గొడవలైనా వాటికి తలొగ్గి.. తమ జీవితభాగస్వామి చేయి పట్టుకునే ఉంటారు. కష్టమైనా, సుఖమైనా ఇద్దరూ కలిసి నడవాలంటారు. ఈ రాశుల వారు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ తమ సర్వస్వం అనుకున్న జీవితభాగస్వామి చేయి వదిలిపెట్టరట. రిలేషన్ షిప్ లో తమను అవాయిడ్ చేయడం వంటి పనులు అస్సలే చేయరట.

వృషభరాశి (Taurus) :

ఈ రాశివారు తమ భాగస్వామి పట్ల విధేయతగా ఉంటారు. అలాగే ఉన్నది ఉన్నట్లు ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడుతారు. రిలేషన్ షిప్ పట్ల కమిట్ మెంట్ తో ఉంటారు. తమ రిలేషన్ షిప్ కు విలువనిస్తారు.

కర్కాటక రాశి (Cancer) :

ఈ రాశి గల వ్యక్తులు తమ భాగస్వాములను అమితంగా ప్రేమిస్తారు. అలాగే ఎక్కువగా సానుభూతి కలిగి ఉంటారు. జీవిత భాగస్వాములకు పూర్తి మద్దతునిస్తారు. ఎంతలా ప్రేమిస్తారో.. నమ్మించి మోసం చేస్తే.. అంతలా ద్వేషిస్తారు.

తులారాశి (Libra) :

ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. తమ పార్ట్నర్ ఆలోచనలకు విలువ ఇస్తారు. జీవిత భాగస్వాముల పట్ల ఎల్లప్పుడూ అటెన్షన్ గా ఉంటారు. ఎక్కువ కేర్ తీసుకుంటారు.

వృశ్చికరాశి (Scorpio) :

ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిని, వారి కోరికలను, ఆశయాలను, ఆలోచనలను అర్థం చేసుకుంటారు. అంత తేలికగా వారిని వదిలిపెట్టరు.

మీనరాశి (Pisces) :

ఈ రాశివారు తమ పార్టనర్ పట్ల చాలా సహజంగా ఉంటారు. అలాగే సానుభూతి పరులు కూడా. పార్ట్నర్ ఎమోషన్స్ ను పంచుకోవడంలో నిర్లక్ష్యం అస్సలు చూపించారు. వారిపట్ల చాలా కేరింగ్ ను చూపిస్తారు. ఎల్లప్పుడూ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు.

 

 

 

 

Exit mobile version