Site icon HashtagU Telugu

Anemia : బీరకాయతో రక్తహీనత సమస్యకు చెక్..!!

blood cells

blood cells

ఆడవారిలో రక్తహీనత అనేది పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లోగానీ, ఆడవాళ్లలో రక్తహీనత అనేది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం అవుతోంది. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల రోజంతా నీరసంగా ఉండటం, ఏ పనిచేసినా తొందరగా అలసిపోవడం జరుగుతుంది. రక్తహీనత అనేది పిల్లల్లో సరిగ్గా తినకపోవడం, శరీరానికి శ్రమ లేకుండా ఉండటం, కావాల్సిన మోతాదులో హిమోగ్లోబిన్ అందడం లేదు. అయితే మహిళల్లో హార్మోన్స్ హెచ్చు తగ్గు వల్ల నెలసరి సమస్యల వల్ల రక్తహీనత అనే సమస్య ఏర్పడుతుంది. ఈ రక్తహీనతను తగ్గించుకునేందుకు డాక్టర్లు ఎన్నోరకాల మెడిసిన్స్ ఇవ్వడంతోపాటు కూరగాయాలు, ఆకుకూరలు క్రమం తప్పకుండా తినమని సలహా ఇస్తుంటారు. అయితే రక్తహీనతను తగ్గించుకునే మార్గాలేంటో తెలుసుకుందాం.

కూరగాయలలో బీరకాయ గురించి తెలియనివారుండరు. బీరకాయల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో అందరికీ తెలియదు. దీన్ని తరచుగా వంటల్లో వాడుతుంటారు. బీరకాయ పచ్చడి, పప్పు, కర్రీ ఇలా దీంతో ఎన్నోరకాల వంటలు చేయవచ్చు. బీరకాయ వల్ల శరీరానికి కలిగే మేలు తెలుస్తే మీరు ఆశ్చర్యపోతారు. బీరకాయకి చలువ చేసే గుణం ఉంది. దీంతో మన శరీరంలో ఉండే వేడిని తగ్గించేస్తుంది. మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు సహాయం చేస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. అందుకే అనారోగ్యంగా ఉన్నవారు బీరకాయాలు తీసుకుంటే మంచిది. అనారోగ్యం వల్ల శరీరంలో జీవక్రియలు సరిగ్గా జరగవు. ఆ సమయంలో బీరకాయతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బీరకాయలో ఉండే పోషకాలు..
బీరకాయలో విటమిన్ ఏ , సీ, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. జ్వరంతో బాధపడుతున్నవారికి బీరకాయ పొట్టుతో చేసే పచ్చడి వండిపెడితే తక్షణమే శక్తి వస్తుంది. బీరకాయ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అధిక బరువును కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. యాంటీఇన్ల్ఫమేటరీగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు..పోషకాలు రక్తహీనతను తగ్గిస్తాయి.

 

Exit mobile version