Site icon HashtagU Telugu

After Death: మరణించే సమయంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Death

Death

సాధారణంగా చాలామంది చనిపోయే ముందు కొంతమందికి ముందుగానే తెలుస్తుంది అని అంటూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే సమయంలో కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కనిపిస్తాయట. ఆ లక్షణాలు కనిపిస్తే వారు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారట. మరి మనిషి చనిపోయే సమయంలో కనిపించే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. చనిపోయిన తర్వాత మనిషి శరీరం నుంచి ఆత్మ వెళ్లిపోతుంది. ఇక భగవద్గీత ప్రకారం నవ రంద్రాలు ఉన్నాయి. అయితే ఎవరైతే వారి జీవితంలో మంచి మంచి పనులు పుణ్యాలు చేసి ఉంటారు వారి శరీరం ఎగువ ద్వారం నుంచి వారి ఆత్మ బయటకు వెళ్తుంది.

ఎగువ భాగం అనగా కళ్ళు,ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి. జీవితంలో మంచి పనులు చేసి పుణ్యాలు చేసిన వారి ఆత్మలు ఈ ద్వారాలు గుండా నే బయటకు వెళ్తాయి. ఆత్మ ముక్కు నుంచి బయటకు వెళ్తే ముక్కు కొంచెం వక్రంగా మారుతుందట. అదే కళ్లు నుంచి కళ్లు మూసుకోర. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే చెవి పైకి లాగినట్లు కనిపిస్తుంది. ఇక నోరు నుంచి అయితే నోరు తెరుచుకొని ఉంటుంది. బతికినన్ని రోజులు ఎటువంటి పనులు చేసి ఎలాంటి వ్యవహారం చేసినా చనిపోయే సమయంలో ముఖం సంతోషంగా ఉంటే వారు స్వర్గానికి వెళ్తారని నమ్ముతూ ఉంటారు.

అయితే జీవితంలో తప్పులు పాపం చేసిన వారి ముఖంలోని మరణ సమయంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. మరణ భయంతో చనిపోయిన వారు నరకానికి వెళ్తారని చెబుతూ ఉంటారు. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. చనిపోయిన తరువాత ఆ సమయంలో ఆత్మ భయం కారణంగా శరీరం ఇదిగో భాగం జారుతుంది. ఇటువంటి
పరిస్థుతుల్లోనే భయం కారణంగా మలం, మూత్రం బయటకు వస్తుంది. ఎవరైతే మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోరో వారు స్వర్గానికి వెళ్తారు.

Exit mobile version