Thyroid: ఈ లక్షణాలు మీలో ఉంటే….అది థైరాయిడ్ కావొచ్చు…!

థైరాయిడ్ హార్మోన్లు....మానవశరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పిల్లల మెదడు పనితీరు చురుగ్గుగా ఉండాలంటే వారిలో థైరాయిడ్ హార్మోన్లు సరైన మొత్తంలో ఉండాలి.

  • Written By:
  • Publish Date - February 8, 2022 / 03:56 PM IST

థైరాయిడ్ హార్మోన్లు….మానవశరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ కూడా సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. పిల్లల మెదడు పనితీరు చురుగ్గుగా ఉండాలంటే వారిలో థైరాయిడ్ హార్మోన్లు సరైన మొత్తంలో ఉండాలి. పిల్లల్లో మాత్రమే కాదు గర్బిణిలు, పుట్టబోయే పిల్లలు అరోగ్యంగా ఉండాలంటే వారిలో థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా ఉండాలి. ఈ థైరాయిడ్ హార్మోన్ల వల్లే కడుపులోని పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.

థైరాయిడ్ హార్మోన్స్ పెరిగి పిల్లలకు, వారి శరీర ఎదుగుదలకు ఎంతోగానో ఉపయోగపడతాయి. అంతేకాదు పెద్దవారిలోనూ తమ రోజువారి పనులు చేసుకోవాలంటే తగిన శక్తిని అందిస్తాయి. అంతేకాదు పని పట్ల ఆసక్తిని సెక్స్ చేయాలన్నా ఆసక్తిని పెంచడంలోనూ ఈ హార్మోన్స్ ఎంతో అవసరం. అయితే కొంతమంది ఆడవారిలో ఈ థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దాని వల్ల పీరియడ్స్ టైమింగ్స్ మారుతుంటాయి. అలాగే కడుపులో ఇబ్బందిగా అనిపిస్తుంది. తలనొప్పి, నీరసంగా వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలన్నీ కేవలం పని ఒత్తిడి వల్ల కలిగినవే అంటూ చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఈ లక్షణాలు థైరాయిడ్ సమస్య ఉందని చెప్పే సంకేతాలు అయిఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి లక్షణాలో తెలుసుకుందాం.

*థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో ఫస్ట్ కనిపించే లక్షణం నీరసంగా ఉండటం. తరచుగా నీరసంగా అనిపించినట్లయితే…వెంటనే వైద్యులను సంప్రదించండి. థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకోవడం చాలా ముఖ్యం.
* జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చినా కూడా దానిని థైరాయిడ్ సమస్యగానే అనుమానించాలి. ఎందుకంటే కడుపు ఉబ్బరంగా ఉండటం, మలబద్ధకం, డయేరియా వంటి లక్షణాలు ఆ కోవాకే చెందినవి.
* ఇక ఉన్నట్లుండి బరువు తగ్గడం, బరువు పెరగడం ఇవి కూడా థైరాయిడ్ లక్షణాలే. ఎందుకంటే జీవక్రియలను థైరాయిడ్ గంథ్రి కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీరు ఉన్నట్లుండి బరువు తగ్గుతుంటే హైపర్ థైరాయిడిజంగా గుర్తించాలి. బరువు పెరిగినట్లయితే హైపోథైరాయిడిజంగా భావించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు ఒక్కోసారి మెటబాలిజం లెవెల్స్ తగ్గినా లేదా పెరిగిన కూడా ఇదే విధంగా జరుగుతుంటుంది.
*ఇక శరీర పనితీరులోనూ హార్మోన్ల ప్రభావం ఎలా ఉంటుందో…మానసిక పనితీరుపై కూడా ఆవిధంగా హార్మోన్ల ప్రభావం ఉంటుందట. కాబట్టి ఎలాంటి కారణం లేకుండా మూడ్ ఆఫ్ అయినట్లయితే థైరాయిడ్ సమస్య వచ్చినట్లుగానే భావించాలి.
*మనకు థైరాయిడ్ సోకిందనే విషయాన్ని మన ఆకలి చెబుతుంది. ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఆకలి ఉండదు. బరువు పెరగడం, తగ్గడం వంటివాటితో సంబంధం లేకుండా ఆకలి ఉండదు. ఈ లక్షణాలన్నీ కూడా మీలో కనిపించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించి సలహాలు తీసుకోండి.