Site icon HashtagU Telugu

Life Certificate: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. లైఫ్ సర్టిఫికేట్ కు జనవరి 31 వరకు గడువు..!

Post Office Saving Schemes

Post Office Saving Schemes

Life Certificate: దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ (Life Certificate) సమర్పించాలి. సాధారణంగా ప్రభుత్వం అక్టోబర్, నవంబర్‌లలో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లకు గడువు ఇస్తుంది. అయితే పెన్షనర్లకు ఈ గడువు పొడిగించబడింది. డిఫెన్స్ పెన్షనర్లు ఇప్పుడు తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని 31 జనవరి 2024 వరకు సమర్పించవచ్చు. అంతకుముందు దాని చివరి తేదీ 30 నవంబర్ 2023.

డిఫెన్స్ పెన్షనర్లకు ప్రత్యేక మినహాయింపు

ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. డిఫెన్స్ పెన్షనర్లు 2023 నవంబర్ 30 నాటికి లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంది. కానీ ఇప్పుడు దాని గడువును జనవరి 2024 వరకు పొడిగించారు. వెబ్‌సైట్‌లో పెన్షనర్లు జనవరి 31 లోపు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని కోరారు. అలా చేయడంలో విఫలమైతే వచ్చే నెల నుంచి పెన్షన్ నిలిచిపోతుంది. దీని తర్వాత, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మాత్రమే పెన్షన్ మళ్లీ ప్రారంభమవుతుంది.

Also Read: Emergency Landing: విమానం గాలిలో ఉండగా పగిలిన కిటికీ అద్దం.. అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన పైలట్, వీడియో..!

లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు సమర్పించాలి?

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిబంధనల ప్రకారం.. రాష్ట్ర, కేంద్ర పెన్షన్ హోల్డర్లందరూ సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీంతో పెన్షనర్ బతికే ఉన్నాడని తెలపడం కోసం ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. లైఫ్ సర్టిఫికేట్ ఒక సంవత్సరం మాత్రమే చెల్లుతుంది. ఇది ప్రతి సంవత్సరం సమర్పించాలి. మీరు ఇంకా ఈ పనిని పూర్తి చేయకపోతే వీలైనంత త్వరగా పూర్తి చేయండి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి అనేక దారులు ఉన్నాయి. పెన్షనర్లు బయోమెట్రిక్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇది కాకుండా జీవిత ధృవీకరణ పత్రాన్ని బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా కూడా సమర్పించవచ్చు.

We’re now on WhatsApp. Click to Join.