Uric acid : కీళ్లనొప్పులు బాధిస్తున్నాయా..అయితే శరీరంలో ఇది పెరిగి ఉంటుంది..!!

ఈమధ్యకాలంలో చాలామంది ఎన్నో రకాల రోగాలతో సతమతమవుతున్నారు. కారణం మారుతున్న జీవనశైలి. చాలా మందికి రక్తంలో యూరిక్ స్థాయిలు పెరగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Istock 804154044

Istock 804154044

ఈమధ్యకాలంలో చాలామంది ఎన్నో రకాల రోగాలతో సతమతమవుతున్నారు. కారణం మారుతున్న జీవనశైలి. చాలా మందికి రక్తంలో యూరిక్ స్థాయిలు పెరగడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. మన శరీరంలో ఒక సేంద్రీయ సమ్మేళణం అయిన యూరిక్ ఆమ్లం రక్తప్రవాహంలో తిరుగుతూ మన శరీర జీవక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ స్థాయిలు ఎక్కువైతే..కిడ్నీల్లో రాళ్లు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే యూరిక్ స్థాయిలు నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

డ్రైఫ్రూట్స్..
యూరిక్ స్థాయి నియంత్రణలో ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో డ్రైఫ్రూట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాదంపప్పు, యూరిక్ స్థాయిని కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడుతుంది. ప్రతిరోజూ నాలుగు లేదా ఐదు బాదం పప్పులను తీనడం మంచిది.

బాదం పప్పు..
బాదం పప్పులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, జింక్, విటమిన్ కే…పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

జీడిపప్పు…
ఇక జీడిపప్పులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఇవి యూరిక్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో కూడా సాయపడుతుంది. నొప్పులు ఉన్నవారు పరతిరోజూ ఐదు జీడిపప్పులను తినడం మంచిది.

వాల్ నట్స్..
వాల్ నట్స్ ను సూపర్ ఫుడ్ అంటుంటారు. వీటిలో ఒమేగా -3 ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉండటం చేత శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రోజుకు రెండు వాల్ నట్స్ తింటే మంచి ఫలితం ఉంటుంది. వాల్ నట్స్ కాస్త ధర ఎక్కువైనా కానీ దానికి తగ్గ ఫలితం ఉంటుంది.

అవిసె గింజలు…
ఇవి శరీరంలో యూరిక్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అవిసె గింజలలో శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని ముఖ్యమైన కొవ్వు, ఆమ్లాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక యూరిక్ స్థాయిల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది.

  Last Updated: 07 Jun 2022, 04:58 PM IST