Mistakes in Rain: వర్షం పడేటప్పుడు ఇంట్లో చేయకూడని తప్పులు ఇవే..?

ఈ సారి ఎండాకాలం కాస్త వర్షాకాలంగా మారింది. ఎండకాలంలో వర్షాలు పడుతుండటంతో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తోంది. సమ్మర్ లో సాధారణంగా ఎండలు బాగా ఉంటాయి. కానీ ఈ సారి భిన్నంగా ఎండాకాలంలో వానలు ఎక్కువగా పడుతున్నాయి.

  • Written By:
  • Updated On - May 28, 2023 / 08:46 PM IST

Mistakes in Rain: ఈ సారి ఎండాకాలం కాస్త వర్షాకాలంగా మారింది. ఎండకాలంలో వర్షాలు పడుతుండటంతో ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభిస్తోంది. సమ్మర్ లో సాధారణంగా ఎండలు బాగా ఉంటాయి. కానీ ఈ సారి భిన్నంగా ఎండాకాలంలో వానలు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో ఈ సారి ఎండాకలం కాస్త తక్కువగానే చెప్పవచ్చు. అయితే వర్షాలు పడుతున్నప్పుడు ఇంట్లో కొన్ని పనులు చేయకూడదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండాకాలం ముగుస్తుంది. వచ్చే నెల నుంచి వర్షాకాలం మొదలు కానుంది. నైరుతి రుతుపవనాలు కూడా వచ్చేస్తున్నాయి. జూన్ 3 లేదా 4వ తేదీన కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతీసారి నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళ తారాన్ని తాకుతాయి. కానీ ఈ సారి కాస్త ఆలస్యంగా వస్తాయి. నైరుతి రుతువవనాలు వస్తే వర్షాలు బాగా కురుస్తాయి. దీంతో వర్షలు పడటప్పడు ఇంట్లో కొన్ని పనులు చేయకూడదట.

వర్షంలో తడిసి ఇంట్లోకి వచ్చేటప్పుడు తడి కాళ్లతో ఇంట్లోకి అడుగుపెట్టకూడదు. తడికాళ్లతో వెళ్లడం వల్ల టైల్స్ పై నీళ్లు పడతాయి. దీని వల్ల జారి కిందపడే అవకాశముంటుంది. టైల్స్ తడిగా ఉంటే జలుబు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. ఇక వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవు కాబట్టి పొడి దుస్తులు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక తడిసిన బట్టలను ఉతికి వాడాలి. అలాకాకుండా డ్రైగా ఉన్నప్పుడు వాడితే చర్మ సంబంధిత సమస్యలు రావొచ్చు.

ఇంట్లోని గొడలు తేమగా ఉన్నచోట పవర్ పాయింట్స్ ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షాకాలంలో కరెంట్ షాక్ తగలవచ్చు. అలాగే ఇంటి పైకప్పు లీక్ అయితే వెంటే సరిచేసుకోవాలి. ఇక ఇంటి మెట్లపై వర్షం నీళ్లు ఉంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి. వర్షపు నీళ్లు ఉంటే నడిచేటప్పుడు జారి పడిపోయే అవకాశం ఉంటుంది.