Site icon HashtagU Telugu

LPG cylinder Price: శుభవార్త…తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర…ఇవే కొత్త ధరలు..!!

దసరాకు ముందే సామాన్యులకు అదిరేపోయే వార్త ఇది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. చిన్న వ్యాపారులు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, స్వీట్ షాప్స్ వారికి ఊరటినిస్తూ చమురు సంస్థలు ధరలను తగ్గించాయి. శనివారం ప్రభుత్వ చమురు పంపిణీ సంస్థలు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలో రూ. 36.5 వరకు తగ్గింపును ప్రకటించాయి. ఈ తగ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.25.5 తగ్గి రూ.1859.5కి చేరుకుంది.

దీంతో పాటు దేశంలోని ఇతర ప్రధాన మెట్రోలైన కోల్‌కతాలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.36.5 తగ్గి రూ.1,995.5కి, ముంబైలో రూ.32.5 తగ్గి రూ.1,811కి, చెన్నైలో రూ.35.5 నుంచి రూ.2009.5కి చేరింది. అయితే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర తగ్గింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

హైదరాబాద్ లో రూ. 36.50రూపాయలు తగ్గడంతో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ 2099.5 నుంచి రూ. 2063కి తగ్గింది. ఏపీలోని విజయవాడలో రూ. 2035.5వైజాగ్ లో 1908.5 కి చేరింది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఈసారి కూడా ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

Exit mobile version