Site icon HashtagU Telugu

BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే దశాబ్ది ఉత్సవాలు ఇవే

Jagtial MLA

Jagtial MLA

BRS Party: తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా BRS PARTY ఆధ్వర్యంలో జరుగుతున్న 3రోజుల ఉత్సవాల సందర్భంగా ఈ క్రింది కార్యక్రమాలు జరుగనున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పంపింది. అయితే కేసీఆర్ హాజరవుతారా అనేది ఆసక్తిగా మారింది. పదేళ్ల తర్వాత మొదటిసారి పోటాపోటీగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది.

మొదటి రోజు

01-06-2024 న సాయంత్రం 5గంటల వరకు పబ్లిక్ గార్డెన్ కు మీ మీ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున హాజరు కాగలరని ఒక ప్రకటనలో తెలిపింది.

రెండవరోజు

02-06-2024 న ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ లో జరుగనున్న జెండా కార్యక్రమమం. 10 గంటలకు జరిగే సభలో నియోజక వర్గాల వారీగా విధిగా పాల్గొనగలరు

మూడవరోజు

03-06-2024
మీ మీ నియోజకవర్గాల జిల్లా ఆఫీసులలో జిల్లా అధ్యక్షులతో కలిసి జెండా కార్యక్రమాల్లో తప్పని పాల్గొన వలసిందిగా విజ్ఞప్తి