Site icon HashtagU Telugu

Smart Phones : మార్కెట్ లో బడ్జెట్ ధరలో అద్భుతమైన ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే?

These Are The Best Smart Phones In The Market With Amazing Features At A Budget Price..

These Are The Best Smart Phones In The Market With Amazing Features At A Budget Price..

Smart Phones under Budget : ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోతూనే ఉంది. దీంతో వినియోగదారుల కోసం మొబైల్ తయారీ సంస్థలు కూడా అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను (Smart Phones) మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను (Smart Phones) విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటుగా ఎప్పటికప్పుడు ఆయా స్మార్ట్ ఫోన్లపై (Smart Phones) తగ్గింపు ధరలను ప్రకటిస్తూ అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇకపోతే మీరు కూడా బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్ లు కలిగిన స్మార్ట్ ఫోన్ మి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా. అయితే మార్కెట్లో 20 వేల లోపు అద్భుతమైన ఫీచర్లతో అదరగొడుతున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ.. రూ. 25వేల లోపు బడ్జెట్ ధరలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. శక్తివంతమైన స్ఫుటమైన విజువల్స్‌ను అందిస్తోంది. దీనిలో 50ఎంపీ ట్రిపుల్ నో షేక్ క్యామ్ హైలైట్ గా నిలుస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 4 జనరేషన్స్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 సంవత్సరాల భద్రతా అప్‌డేట్‌లు వస్తాయి. 12జీబీ ర్యామ్, 128జీబీ ఎక్స్ టర్నల్ మెమరీ ఉంటుంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో 16,499గా ఉంది.

వన్ ప్లస్ నోర్డ్ సీఈ2 లైట్ 5జీ.. ఈ ఫోన్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుక వైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతో పటు డెప్త్ లెన్స్, మాక్రో లెన్స్‌ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అనుకూలంగా ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు సరిగ్గా సరిపోతోంది. 33వాట్ల సూపర్ వీఓఓసీ సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ మెమరీతో ఉండే ఈ ఫోన్ ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం రూ. 17,999గా ఉంది.

నోకియా జీ42 5జీ.. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480+ 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. 6జీబీ ర్యామ్, 5జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. ఫోన్ వెనుకవైపు 50ఎంపీ ట్రిపుల్ ఏఐ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 12,599గా ఉంది.

రెడ్ మీ నోట్ 12 5జీ.. ఈ ఫోన్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మృదువైన, శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్, అడ్రెనో 619 జీపీయూతో కలిసి, సమర్థవంతమైన, వేగంగా ప్రతిస్పందించే పనితీరును నిర్ధారిస్తుంది. 48ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ నాణ్యమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ మెమరీతో ఉండే ఈ ఫోన్ ధర అమెజాన్లో రూ. 15,499గా ఉంది.

వన్ ప్లస్ నోర్డ్ సీసీ3 5జీ.. ఈఫోన్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. సోనీ ఐఎంఎక్స్ 890తో కూడిన 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌లు మీ ఫోటోగ్రఫీ అనుభవానికి బహుముఖ ప్రజ్ఞను జోడిస్తాయి. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 782జీ ఆధారంగా పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ ఓఎస్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ 128జీబీ మెమరీతో ఉండే ఈ ఫోన్ ధర అమెజాన్లో రూ. 24,999గా ఉంది.

Also Read:  Walking: నడకే మనిషికి మంచి ఆరోగ్యం