Phone Radiation: పాత ఫోన్లు వాడుతున్నారా..?రేడియేషన్ రిస్క్ తో జాగ్రత్త..!!

మీ ఫోన్లు పాతవైపోయినా వాడుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!! ఎందుకంటారా..? ఈ స్టోరీ చదవండి..!

  • Written By:
  • Publish Date - April 11, 2022 / 02:11 PM IST

మీ ఫోన్లు పాతవైపోయినా వాడుతున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!! ఎందుకంటారా..? ఈ స్టోరీ చదవండి..! మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందన్న సంగతి తెలిసిందే. కానీ దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC)నిబంధనల ప్రకారం…ఒక కేజీ మానవ కణజాలానికి 1.6W (వాట్), దీనికంటే తక్కువ రేడియేషన్ ఉంటేనే అది సురక్షితం. అంతకుమించినట్లయితే దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇండియాలోనూ ఇదే పరిమితి అమల్లో ఉండగా…దీన్ని శార్ వ్యాల్యూగా చెబుతారు. శార్ అంటే స్పెసిఫిక్ అబ్జార్ప్ షన్ రేట్ అని అర్థం. ఈ పరిమితి వరకే మన శరీర కణజాలం రేడియేషన్ను గ్రహిస్తుంది.

అయితే కొన్ని పాత స్మార్ట్ ఫోన్ మోడళ్లు..ఎక్కువ రేడియేషన్ను రిలీజ్ చేస్తున్నట్లు బ్యాంక్ లెస్ టైమ్స్ అనే సంస్థ తన రిపోర్టులో పేర్కొంది. మోటరోలా ఎడ్జ్ సార్ వ్యాల్యూ 1.79W/KGగా ఉంది. రెండో స్థానంలో ZTEయాక్సన్ 1 5జి మోడల్ ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటులోలేనప్పటికీ…దీని శార్ వ్యాల్యూ 1.59W/KGగా ఉంది. అంటే గరిష్ట పరిమితి వద్ద ఉందని అర్థం. ONE PLUSE 6Tమోడల్ శార్ వ్యాల్యూ కూడా 1.55W/KGగా పరీక్షల్లో తేలింది. ఫోన్లు మరీ పాతవైనా కూడా వాటిని వాడటం వల్ల అధిక రేడియేషన్ రిస్క్ తప్పదని దీన్ని బట్టి అర్థమవుతోంది.