Health Tips : కడుపుబ్బరానికి ఈ ఆహార పదార్థాలే కారణం.. వీటిని టచ్ చెయ్యకపోతే బెస్ట్!

ఇటీవల కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కడుపుబ్బరం. ఈ కడుపుబ్బరం కారణంగా కడుపు ఉబ్బినట్టుగా

  • Written By:
  • Publish Date - August 14, 2022 / 09:45 AM IST

ఇటీవల కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కడుపుబ్బరం. ఈ కడుపుబ్బరం కారణంగా కడుపు ఉబ్బినట్టుగా ఉండి నిలబడడానికి కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్నిసార్లు కడుపుబ్బడం కారణంగా నిద్ర పట్టకపోవడం ఊపిరి కూడా సరిగా ఆడక పోవడం,నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతా ఉంటాయి. అయితే మనం తినే ఆహార పదార్థాలే మనకు అడుగుబ్బరం పై ప్రభావం చూపుతాయి అని నిపుణులు అంటున్నారు. మరి కడుపుబ్బరాన్ని తగ్గించుకోవాలి అంటే ఈ 12 రకాల ఆహార పదార్థాలను తినాల్సిందే. మరి కడుపుబ్బరాన్ని తగ్గించే ఆ పనిని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దోసకాయలు:

దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ. అయితే దోసకాయలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగవుతుందని, కడుపుబ్బరం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

అల్లం:

జీర్ణ వ్యవస్థకు అత్యంత మేలు చేసే ఆహార పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. అల్లంకి ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు, అల్లంలోని జింజిబైన్ అనే ఎంజైమ్ జీర్ణశక్తిని మెరుగుపర్చుతాయట.

అరటి పండ్లు:

అరటి పండ్లలో ఫైబర్ తోపాటు పొటాషియం ఎక్కువ. అయితే తరచూ కడుపు ఉబ్బరంతో బాధపడేవారు వారు అరటిపండు తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చు.

పెరుగు:

మంచి ప్రోబయాటిక్ ఆహారంలో పెరుగు కీలకమైనది. దీనిలోని ప్రోబయాటిక్స్ మన జీర్ణ వ్యవస్థలోని మంచి బ్యాక్టీరియా ఎదుగుదలకు తోడ్పడుతాయి. ఇది జీర్ణ శక్తి పెరిగి కడుపుబ్బరాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది.

ఓట్స్:

ఆహారం ఏదైనా ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుందని ఓట్స్ లో ఉండే అధిక ఫైబర్ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీ:

శరీరంలో జీవ క్రియలు సమర్థవంతంగా కొనసాగడానికి గ్రీన్ టీ కూడా బాగా ఉపయోగ పడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరానికి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

టమాటాలు:

కడుపు ఉబ్బరాన్ని తగ్గించే ఉత్తమ ఆహార పదార్థాల్లో టామాటాలు కూడా ఒకటి. ఇందులోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగు పర్చుతుంది.

నిమ్మ జాతి పండ్లు:

నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గించేందుకు దోహదపడతాయి.

గ్రీన్ లీఫీ వెజిటబుల్స్:

పాల కూర, క్యాబేజీ, లెట్యూస్ వంటి వాటిలో ఫైబర్, పలు రకాల పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులను దూరం చేస్తాయి.

పుచ్చకాయ:

దోసకాయల తరహాలోనే పుచ్చకాయల్లో కూడా కొన్ని రకాల పోషకాలు, నీటి శాతం ఎక్కువ. అంతేగాకుండా వీటిలో లైకోపీన్ యాంటీ ఆక్సిడెంట్స్ జీర్ణశక్తిని మెరుగుపర్చుతాయి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీస్:

స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీస్ తోపాటు ఇతర బెర్రీ జాతికి చెందిన పండ్లు కడుపు ఉబ్బరాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.

పప్పు ధాన్యాలు:

పప్పు ధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణశక్తి మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. ముడి పప్పు ధాన్యాలతో ప్రయోజనం ఎక్కువని స్పష్టం చేసారు నిపుణులు.