BRS: దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయి: గెల్లు శ్రీనివాస్

  • Written By:
  • Updated On - June 16, 2024 / 06:11 PM IST

BRS: బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, నీట్ పేపర్ లీకేజీ కచ్చితంగా జరిగిందని, గుజరాత్ లో పేపర్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నీట్ పరీక్ష లీకేజీలపై ఎందుకు మాట్లాడటం లేదని, నీట్ వలన తెలంగాణ
రాష్ట్రం నష్టపోయిందని, నీట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేయాలని అన్నారు. నీట్ అక్రమాలపై రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు ? అని ప్రశ్నించారు.

తెలంగాణ నుండి గెలిచిన ఎంపీలు నీట్ విద్యార్థుల కోసం ఎందుకు మాట్లాడటం లేదని, నీట్ వలన తెలంగాణ విద్యార్థులకు ర్యాంకులు రావడం లేదని గెల్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడ వున్నారు…? నీట్ పై ఎందుకు మాట్లాడటం లేదు, నీట్ ను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అని ఆయన అన్నారు.