AP Elections 2024 : ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు

దాచేపల్లిలోని కేసనపల్లి గ్రామంలో ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకు వెళ్లే విషయంలో వైసిపి టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది

Published By: HashtagU Telugu Desk
Ap Poling Tention

Ap Poling Tention

ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ (AP Polling ) కొనసాగుతుందని అంత అనుకునేలోపే..పలు చోట్ల ఉద్రిక్తత ఘటనలు మొదలయ్యాయి. పల్నాడు జిల్లాలో పలు చోట్ల టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. దాచేపల్లిలోని కేసనపల్లి గ్రామంలో ఓటర్లను పోలింగ్ బూత్‌కు తీసుకు వెళ్లే విషయంలో వైసిపి టిడిపి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో టిడిపి, వైసీపీ నేతలు గాయపడ్డారు. అలాగే రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ ఏజెంట్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటన ఫై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే అదనపు బలగాలు తరలించాలని ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక అన్నమయ్య జిల్లా, కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, పాపక్క గారి పల్లెలో టిడిపి ఏజెంట్లపైన వైసిపి నాయకులు దాడి చేశారు. అలాగే కడప జిల్లాలో కమలాపురం కోగట్టంలోనూ ఇరు పార్టీల ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఓవరాల్ గా అనేక చోట్ల వైసీపీ శ్రేణులు దాడులకు దిగుతుండడం తో ఈసీ సైతం సీరియస్ అవుతుంది. ఓడిపోతున్నాం అనే భయంతో, జగన్ రెడ్డి ప్రజలని ఓట్లు కూడా వేయనివ్వటం లేదు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం దళ్లాయి పల్లె బూత్ లో ఈవీఎం పగలుగొట్టిన వైసీపీ నేతలు అంటూ టీడీపీ ట్వీట్ చేసింది.

Read Also : Putin : రష్యా రక్షణ మంత్రి ఔట్.. పుతిన్ సంచలన నిర్ణయం

  Last Updated: 13 May 2024, 10:15 AM IST