నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) తాను ఏ పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్ (BRS) పార్టీని వీడబోనని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీ ఉనికే లేదని, తాను బీజేపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని సమయంలో తాను వ్యాపారం చేసుకుంటానని, కానీ ఏ పార్టీలోకి వెళ్లనని ఆయన తేల్చి చెప్పారు. తన పార్టీ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలను ఆయన ఖండించారు.
Cloud Burst : ఉత్తరాఖండ్‌లో భారీ వరదల కారణంగా కొట్టుకుపోయిన ఇళ్లు
గతంలో తనతో సన్నిహితంగా ఉన్న బాలరాజు బీజేపీలో చేరడంపై మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. “తమ్ముడూ, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు” అని బాలరాజుకు చెప్పానని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ, పార్టీ మారాలనేది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. ఈ చేరికలు మార్పుల వల్ల పార్టీకి నష్టం లేదని ఆయన పేర్కొన్నారు.
మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి తన విధేయతను మరోసారి చాటారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కానీ సిద్ధాంతాలు, పార్టీ పట్ల నిబద్ధత ముఖ్యం అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌లో తనకు ఎప్పటికీ మంచి గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం పనిచేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ను బలపరిచేందుకు కృషి చేస్తానని, పార్టీ శ్రేణులతో కలిసి ముందుకెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
