Site icon HashtagU Telugu

BRS MLA: పార్టీ మారే ప్రసక్తే లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Sudhir Reddy

Sudhir Reddy

BRS MLA: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు  రావడంతో పాటు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరని  ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను కేసీఆర్‌ సైనికుడినని, భారాసలోనే ఉంటానని తెలిపారు. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి పరామర్శిస్తే తప్పు పట్టడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనటం సరికాదన్నారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.