Site icon HashtagU Telugu

Sonia Gandhi: జగ్గారెడ్డికి సోనియా వార్నింగ్.. మీడియా ద్వారా మాట్లాడాల్సిన అవసరమేంటి!

Soniya

Soniya

సంగారెడ్డి  కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో తనకు ‘కోవర్ట్’ అనే ముద్ర వేశారని, తగిన గుర్తింపు లేదనీ జగ్గారెడ్డి రాజీనామా అంశాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. శనివారం ఆయన తన రాజీనామా విషయమై స్పందిస్తూ త్వరలో పార్టీ పదవులకు రాజీనామా చేస్తానని, ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాసినట్టు పేర్కొన్నారు.

పార్టీ నుంచి వైదొలగే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన జగ్గారెడ్డి ఆగ్రహావేశాలపై స్పందిస్తూ.. మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియాతో చర్చించే సమయంలో సంయమనం పాటించాలని నేతలను కోరారు. “మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనమందరం స్వేచ్ఛగా, నిజాయితీగా చర్చిద్దాం. అయితే నాలుగు గోడల వెలుపల తెలియజేయాల్సినది CWC (కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమిష్టి నిర్ణయం’’ అని సోనియాగాంధీ స్పష్టం చేశారు.

ఏఐసీసీ నాయకుల మధ్య అధికారిక సంభాషణ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ పార్టీ తెలంగాణ ఇంఛార్జి బి మాణికం ఠాగూర్, నాయకులు మీడియా ద్వారా ఎఐసీసీతో మాట్లాడకూడదని అభ్యర్థించారు. “మా గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షుడి అభిప్రాయాన్ని తెలంగాణ నాయకులు గౌరవిస్తారని ఆశిస్తున్నాను. మనం కలిసికట్టుగా ఉంటేనే 2023లో తెలంగాణ కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చగలవు’’ అని ట్వీట్ చేశారు.